Index
వంద ప్రింట్లతో 'ఏక్ పొలీస్' ఈ నెల 28న విడుదల 'నేడు సమాజంలో జరుగుతున్న సమకాలీన ఆంశాలే ప్రధాన ఇతివృత్తంగా 'ఏక్ పోలీస్' చిత్రాన్ని రూపోందించామని, చిత్రంలోని ప్రతీ సన్నివేశం ప్రజలను చైతన్యపరచే విదంగా ఉంటుందని' దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. నాగేంద్ర బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఏక్ పోలీస్' సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సందర్బంగా శుక్రవారం హైదరబాద్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నిర్మాతలలో ఒకరైన ఎన్.హెచ్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతు 'అన్ని కమర్షియల్ హంగులతో సమాజానికి మంచి సందేశాన్ని అందించే రీతిలో చిత్రం రూపొందింది. తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్మకముంది. ఈ నెల 28న చిత్రాన్ని వందప్రింట్లతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. |