| | Cinema Kaburlu | Index
అజ్ణాతంలో నితిన్ యువ కథానాయకుడు నితిన్ బాలీవుడ్ బాట పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి అనూహ్యంగా నితిన్ కి ఆహ్వానం అందింది. వర్మ ప్రస్తుతం 'అజ్ణాత్' అనే హిందీ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమా ద్వారా హిందీ తెరకు యువ నటీనటుల్ని పరిచయం చేయాలని ఆయన భావించారు. ఆ క్రమంలోనే కథానాయకుడిగా నితిన్ ని ఎంపిక చేశారు. వచ్చే నెల 5వ తేది నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం నితిన్ తెలుగులో 'ద్రోణ' చిత్రంలో నటిస్తున్నారు.
వర్మ 'అజ్ణాత్' ఒకే షెడ్యుల్ లో పూర్తవుతుంది. 35 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. శ్రీలంక లో షూటింగ్ చేయాలని వర్మ భావిస్తున్నారు. ఈయన ద్వారా బాలీవుడ్ కి వెళ్లిన దక్షిణాది నటుల జాబితాలో నితిన్ చోటు దక్కించుకున్నారు. |  |
|
|