Index
మహేష్ బాబు సరసన పార్వతీ మెల్టన్ చిత్ర రంగంలో ప్రవేశించిన ఏ హీరోయిన్ అయినా అగ్రహీరోల చిత్రాలలో చేయాలని ఉవ్విళ్ళూరుతారు. మొదటి సినిమానే పెద్ద హీరో సరసన చేయాలని ఇప్పటి హీరోయిన్లు కోరుకుంటున్నారు. స్లోగా సినిమాలు చేసుకుంటూ వచ్చి, పెద్ద హీరో చిత్రంలో అవకాశం కోసం ఎదురుచూసేవారు కథానాయికలు అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ మారింది. మొచటి ఒకటి రెండు సినిమాలకే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలలో తాము నటించాలని కోరుకుంటున్నారు. నేటి నాయికల్లో పార్వతీ మెల్టన్ విషయానికొస్తే 'వెన్నెల' చిత్రం ద్వారా ఆమెరికా నుంచి ఇండియా కొచ్చి వెండి తెరపై మెరిసి, నాలుగైదు సినిమాలకే పవన్ సరసన 'జల్సా' లో చాన్స్ కొట్టేశారు. కుర్రకారుకు ఆ చిత్రణం ఆమెను దగ్గరచేసింది. ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన 'మెయిన్ హీరోయిన్' పాత్రలో ప్రవేశించారు పార్వతి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆమె ఆనందానికి అవదుల్లేకుండా వుంది. దీనికి కారణం 'జల్సా' లో తనకు పేరు రావడానికి కారణమైన త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడైనందున. ఈ రోజు కోసమే తను ఇనాళ్ళుగా వేచి వుంది. |